మొత్తానికి రైతులతో రాజీకి కేంద్రం కీలక అడుగులు..

పంటలకు కనీసం మద్దతు ధర, ఇతర సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు కొద్ది రోజులుగా హర్యానా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్రంతో నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అవి చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో కేంద్రం రైతు సంఘాలతో మరోసారి చర్చలు మొదలు పెట్టింది. ఇదివరకు మూడుసార్లు జరిగిన చర్చలు విజయవంతం కాకపోవడంతో.. ఈ వారం సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకు నాలుగో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట వరకు ఈ చర్చలు జరిగాయి. కేంద్రం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా , వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు కూడా చర్చలలో కూర్చున్నారు. సుదీర్ఘంగా చర్చలు సాగిన అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆ వివరాలను వెల్లడించారు.

Editor