Latest Posts

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ…

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలో 15 వేల పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్డీ స్టేడియంలో బుధవారం 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలు అందించారు. అనంతరం సీఎం మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చాలారోజులుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఖాళీలపై సమీక్ష చేసి నియామకాలు జరిగేలా చూశారన్నారు.

Editor