పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఈ చిత్రం డిసెంబరు 22వ తేదీన విడుదల కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీసింహా తదితరులు నటించారు. మొదటి నుంచి ప్రశాంత్ నీల్ చిత్రాలకు చేస్తున్న టెక్నీషియన్సే ఈ సినిమాకు కూడా పనిచేశారు.
ఈ సినిమాకు మొత్తం రూ.800 కోట్ల వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంది. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ రూ.65 కోట్లకు కొనుగోలు చేసింది. మరో రూ.25 కోట్లు రిటర్న్ బుల్ అడ్వాన్స్ కలుపుకుంటే మొత్తం రూ.90 కోట్లు. నైజాం వరకు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడంతోపాటు రూ.65 కోట్ల షేర్ రావాలి.
ఏపీలో సలార్ థియేటర్ రైట్స్ రూ.95 కోట్లకు జరిగాయి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ సినిమా రూ.150 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి. కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో హోంబలే ఫిలింస్ సొంతంగా విడుదల చేస్తోంది. వీటికి రూ.65 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మూడు రాష్ట్రాల్లో రూ.130 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది.
ఉత్తర భారతదేశం నుంచి రూ.230 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణ భారతదేశం నుంచి రూ.380 కోట్లు రాబట్టాలి. పబ్లిసిటీ ప్రింట్ ఖర్చు రూ.75 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల గ్రాస్, రూ.400 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ కింద లెక్క. భారీ బిజినెస్ టార్గెట్ గా 22న రాబోతోంది.
