Latest Posts

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల కోట్ల జమ చేసారు. ఇక, తాజాగా విద్యా దీవెన పథకం లబ్దిదారులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు లబ్దిదారులకు సూచనలు చేసింది. అమలు బాధ్యత వాలంటీర్లకు అప్పగించింది.

 

Advertisement

జాయింట్ బ్యాంకు ఖాతాల్లో : ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెన పథకం కింద నిధులను ఇప్పటి వరకు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే, తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, నుంచి విద్యార్ది – తల్లి కలిపి జాయింట్ బ్యాంకు ఖాతా ప్రారంభించాలని సూచించింది. లబ్దిదారులు ఈ నెల 24వ తేదీ లోగా బ్యాంకుల్లో జాయింట్ ఖాతాలు ప్రారంభించాలని పేర్కొంది.

 

 

ఈ నెల 28న ఈ పథకంకు సంబంధించిన నిధులు విడుదల చేయనుంది. బ్యాంకుల్లో తెరిచే ఖాతాల్లో ప్రాధమిక ఖాతాదారుగా విద్యార్ధి..రెండో ఖాతాదారుగా తల్లి ఉండాలని సూచించింది.ఈ ఖాతాకి ఎటువంటి డెబిట్ కార్డు ఉండదు. నేరుగా బ్యాంకు నుంచి తల్లి మరియు విద్యార్థి ఇద్దరు సంతకం పెడితేనే అమౌంట్ డ్రా చేయడం జరుగుతుంది. తల్లి లేని వారు తండ్రి, తల్లిదండ్రులు ఇద్దరు లేనివారు గార్డియన్ తో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు.

 

ప్రభుత్వం మార్గదర్శకాలు : ఈ ఖాతాల్లో చెక్ బుక్ తీసుకొనే అవకాశం లబ్దిదారుల ఇష్టానికి వదిలేసారు. సంయుక్త ఖాతాలను లబ్దిదారులతో తక్షణమే తెరిపించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాయి. ప్రతీ బ్యాంకు బ్రాంచి పని దినాల్లో కనీసం వంద సంయుక్త ఖాతాలు తెరిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

AP Govt Suggest for open joint accounts for Vidyanidhi beneficiaraies to depoit funds

జగనన్న విద్యా దీవెన కింద హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన ప‌థ‌కం ద్వారా ఆర్థిక‌ సాయం అందిస్తోంది.

 

Advertisement

ఈ నెల 28న నిధుల విడుదల : తాజాగా విడుదల చేస్తున్న సాయంతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15,593 కోట్లు ఖర్చుచేసింది.విద్యా దీవెన నిధులు : మొత్తం మీద నాలుగేళ్లలో విద్యారంగంపై జ‌గ‌న్ ప్రభుత్వం దాదాపుగా రూ.69,289 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఈ నెల 28న విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 11 లక్షలకు పైగా తల్లుల కాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..ఈ నెల 30న కాల్యాణమస్తు షాదీ తోఫా నిధులను విడుదల చేయనుంది.

Posted Under AP
Editor