అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.
Advertisement
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎన్నోసార్లు దాడులు చేశారని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వరుస కుట్రలు జరుగుతున్నాయని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కాలికి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణలు అని రేవంత్ చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. సంచలనం కోసమే కొత్త ప్రబాకర్ రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారన్నారు.
దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియాకు చూపలేదన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలన్నారు. ఇప్పటి వరకు నిందితుడు రాజు.. రిమాండ్ రిపోర్టు కూడా బయటపెట్టలేదని రేవంత్ తెలిపారు. నిందితుడి కాల్ రికార్డ్ బయటపెట్టాలన్నారు. మరో మూడు కుట్రలు జరుగుతాయని ఇవాళ కేటీఆర్ స్పష్టం చెప్పారని రేవంత్ తెలిపారు. ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు.. డీకే శివకుమార్ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.
కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్ రవు ఎందుకు సమన్వయం చేశారని ప్రశ్నించారు రేవంత్. కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి తెలంగాణలో ప్రదర్శనలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని, ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అన్న రేవంత్.. ప్రశాంత్‌కిషోర్వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటన ఇందుకు ఉదాహరణలుగా రేవంత్ పేర్కొన్నారు.
