తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులు గెలిపించాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఇప్పుడు రెండో విడత ప్రచారానికి సిద్దమయ్యారు. ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
నవంబర్ 9న నామినేషన్లు వేసి కామారెడ్డిలో సభతో ఆ విడత షెడ్యూల్ పూర్తి చేశారు. తాజాగా, మళ్లీ నవంబర్ 13 నుంచి అంటే సోమవారం నుంచి రెండో విడత ప్రచారం నిర్వహంచనున్నారు కేసీఆర్. ఎన్నికల దగ్గరపడుతున్న క్రమంలో రెండో విడతలో ప్రతి రోజూ 3 నుంచి 4 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేస్తున్నారు. 16 రోజుల్లోనే 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. నవంబర్ 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 28వ తేదీ వరకు 54 సభల్లో పాల్గొంటారు.
కేసీఆర్ ప్రచార రెండో షెడ్యూల్ ఇలా:
నవంబర్ 13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నవంబర్ 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం. నవంబర్ 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నవంబర్ 16న ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నవంబర్ 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల నవంబర్ 18న చేర్యాల నవంబర్ 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి నవంబర్ 20న మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ నవంబర్ 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట నవంబర్ 22న తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నవంబర్ 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు నవంబర్ 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి నవంబర్ 25న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నవంబర్ 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక నవంబర్ 27న షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి నవంబర్ 28న వరంగల్ (ఈస్ట్, వెస్ట్), గజ్వేల్‌లలో ప్రచార సభలు నిర్వహించనున్నారు.
Advertisement
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్ తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. కాగా, నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
