టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. నంద్యాలలో అరెస్ట్ అయిన చంద్రబాబును విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుకు జనసేనాని, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మద్దతు ప్రకటించారు.

చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. సీబీఐ నేతలు అరెస్ట్ ను తప్పు బట్టారు. వైసీపీ నేతలు స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్ర పైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలోనే భువనేశ్వరి స్పందించారు.

భువనేశ్వరి స్పందన: చంద్రబాబు అరెస్ట్ పైన ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సోదరుడు నందమూరి రామకృష్ణతో కలిసి భువనేశ్వరి దర్శించుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించారు. ఇటువంటి సమయంలో ధైర్యం ఇవ్వాలని..అమ్మవారి ఆశీర్వాదం..మద్దతు కోరానని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.

ఏపీ ప్రజల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని వివరించారు. ప్రజల కోసం చంద్రబాబు సాగిస్తున్న ప్రయాణం దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరు చేయి చయి కలిపి మద్దతుగా నిలవాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది ఏంటో గుర్తించాలని సూచించారు.

రామకృష్ణ ఎమోషనల్: చంద్రబాబు అరెస్ట్ పైన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబును పాత కేసులో అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. ఇదంతా ప్రభుత్వం కుట్రగా ఆరోపించారు. ఆయన ఏపీ ప్రజలకు సేవ చేసారని .. ప్రతీ సందర్భంలోనూ రాష్ట్రం కోసమే పని చేసారని వివరించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడ్డారని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో చంద్రబాబు పైన ఉద్దేశ పూర్వకంగా కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోదరి పడుతున్న ఆవేదన తనకు మరింత బాధ కలిగిస్తోందన్నారు. విజయవాడకు చంద్రబాబు చేరుకున్న తరువాత భువనేశ్వరి కలిసే అవకాశం ఉంది. అటు నారా లోకేశ్ తన యువగళం యాత్ర నుంచి విజయవాడకు బయల్దేరారు.

చంద్రబాబుకు మద్దతుగా: ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన వైసీపీ నేతలు మద్దతుగా మట్లాడుతున్నారు. అటు టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం పైన ఇప్పటికే సీఐడీ అధికారులు తాము పూర్తి ఆధారాలు సేకరించామని వెల్లడించారు.

Posted Under AP
Editor