పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’.
తమిళ్ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్న మూవీ టీం.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ ని రేపు జులై 22న సాయంత్రం 6:03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. టీజర్ తోనే ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ తో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. కాగా ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తుంది. ఆ మూవీ నుంచి కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకోని ఈ సినిమాలో చాలా మార్పులు చేసినట్లు సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.
