సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలు దాదాపుగా అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టే. ఇక కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి..
ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ డైరక్టర్ త్వరలోనే స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…
అదీ అల్లు అర్హ రేంజ్.. రెండో సినిమాకే నిమిషానికి రూ.20 లక్షలు.. ‘దేవర’లో ఎంత సేపు కనపడనుందంటే?
సూపర్ హిట్లే….: టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిల్ రావిపూడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అనిల్. ఇక ఈ సినిమా తర్వాత.. క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత స్టార్ హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, మహేశ్ బాబులతో సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్లను అందుకున్నాడు.
హ్యాట్రిక్ హిట్…: ప్రస్తుతం అనిల్ రావిపూడి.. నందమూరి నటసింహం బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా… మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ ఖాయమని అభిమానులు అంటున్నారు.
ProjectK First Glimpse: అభిమానులను మోసం చేసిన ‘ప్రాజెక్ట్ కె’ టీమ్.. అంత హైప్ ఇచ్చి ఊసురుమనిపించారే!
ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్: బాలయ్య సినిమా తర్వాత అనిల్ రావిపూడి… ఓ స్టార్ హీరోతో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఇక బాలకృష్ణ మూవీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నెక్ట్స్ చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
భారీ ఫాంటసీ మూవీ…: ఇక అనిల్ రావిపూడికి చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అంటే చాలా ఇష్టమట. అయితే అలాంటి భారీ ఫాంటసీ మూవీని చిరంజీవితో తెరకెక్కించాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ మాటలకు తగ్గట్లుగానే.. చిరంజీవి కూడా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో కలిసి.. జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మూవీలో నటించాలని ఉందని చిరు కామెంట్స్ చేశారు.
