సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, డీకే శివకుమార్ కు నెల రోజుల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

 

ఇన్ని రోజులు తీవ్ర ఉత్కంఠ రేపిన హుబ్బళి-ధారవాడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. ఎట్టకేలకు బీజేపీ రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో హుబ్బళి-ధారవాడ మేయర్‌గా బీజేపీకి చెందిన వీణా భరద్వాద్, డిప్యూటీ మేయర్‌గా బీజేపీ కార్పోరేటర్ సతీష్‌ హానగల్‌ ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌లో బీజేపీ మళ్లీ పట్టు సాధించడంతో పాటు కార్పొరేషన్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కాంగ్రెస్ కల ఏమాత్రం ఫలించలేదు.

 

మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మంత్రులు సతీష్ జారకిహోళి, సంతోష్ లాడ్ తదితరులు శతవిధాలా హుబ్బళి-ధారవాడ కార్పొరేషన్‌లో సత్తా చాటేందుకు వ్యూహం రచించారు. అయితే వీళ్ల వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. బీజేపీ విజయంతో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు టాస్క్‌ ఇచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది.

YES9 TV