‘సలార్‌’ టీజర్‌ సిద్ధం

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది.
‘ఆదిపురుష్‌’ కోలాహలం ముగియడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సలార్‌’ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్‌ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్‌’ కోలాహలం ముగియడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సలార్‌’ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిసున్నది. శృతిహాసన్‌ కథానాయిక.

తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదా జూలై మొదటివారంలో టీజర్‌ను విడుదల చేయబోతున్నారని తెలిసింది. భారీ యాక్షన్‌ హంగులతో సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాలోని ప్రధాన భాగాన్ని తెరకెక్కించారు. ప్రశాంత్‌నీల్‌ డైరెక్ట్‌ చేసిన ‘కేజీఎఫ్‌’ చిత్రాల తరహాలోనే ఇంటెన్స్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌ ప్రధానంగా ‘సలార్‌’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అంటున్నారు. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

YES9 TV