ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ తో మొదలైన ఆ క్రేజ్ ఇప్పటికీ ఆయన వారసత్వం కొనసాగిస్తూనే ఉంది.
అయితే ఇటీవల సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే నిన్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరు కూడా అతనికి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణ్ రామ్ కూడా విషెస్ చేయడంతో పాటు భగవంత్ కేసరి టీజర్ గురించి మెన్షన్ చేశారు.
అయితే వీటన్నింటికి మధ్య ఒక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యకి విషెస్ చెప్పలేదని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చివరిగా 2020లో బాలకృష్ణ బర్త్ డే కి విషెస్ చెప్పారు. తర్వాత రెండేళ్ల నుంచి చెప్పడం లేదు. దీనిపై నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తారక్ కి నందమూరి కుటుంబం మధ్య దూరం పెరుగుతుందని ప్రచారం వినిపిస్తోంది. కళ్యాణ్ రామ్ తారక్ ఒక వైపు మిగిలిన నందమూరి ఫ్యామిలీ అంతా ఓవైపు ఉన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకి తారక్ ని ఆహ్వానించారు. అయితే రాను అని చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్ జయంతి రోజు నివాళి అర్పించేందుకు ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ నందమూరి అభిమానులపై తారక్ కొంత సహనం వ్యక్తం చేశారు.
