రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈరోజు ద్రవ్య విధానంపై తీసుకున్న నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయంపై అందరి చూపు రెపో రేటు (Repo Rate) పైనే పడింది.
ఈసారి కూడా రెపో రేటు (Repo Rate)లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్బీఐ తెలిపింది. అంటే రెపో రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంటుంది. దీనితో పాటు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ద్రవ్యోల్బణం రేటును ప్రకటించారు.
దేశ ద్రవ్య విధానానికి సంబంధించి ఈరోజు పెద్ద ప్రకటన వెలువడింది. రెపో రేటుతో పాటు ద్రవ్యోల్బణంపై దేశ సెంట్రల్ బ్యాంక్ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈసారి రెపో రేటును స్థిరంగా ఉంచాలని నిర్ణయించారు. భారత్‌లో రెపో రేటు ఇప్పటికీ 6.5 శాతమే. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. స్థిరంగా ఉందన్నారు. సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటన చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో ద్రవ్యోల్బణం అంచనా స్వల్పంగా 5.1 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర బ్యాంకు వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా అంచనా వేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 2023లో సీపీఐ 4.7 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఇది 6.4 శాతంగా ఉంది.
