Latest Posts

చిరంజీవి సంచలనం; అభిమానులకు షాక్!!

టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు . 67 ఏళ్ల వయస్సులో కూడా యువ హీరోలా సినిమాల్లో నటిస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో అదరకొడుతున్న చిరంజీవి అభిమానులు అందరూ షాక్ అయ్యే విషయం వెల్లడించారు.

తాను క్యాన్సర్ బారిన పడ్డానని, ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల కోలుకున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

నానక్ రాంగూడాలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించిన ఆయన క్యాన్సర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో కొలనోస్కోపీ చేయించుకోవడం వల్ల ఆ రిపోర్ట్ లో తనకు శరీరంలో పాలిప్స్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారని, ఆ పాలిప్స్ ను అలాగే వదిలేస్తే మెలాగ్లిన్ గా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు అని చిరంజీవి వెల్లడించారు.

80 నుంచి 90 శాతం పాలిప్స్ మెలాగ్లిన్ గా మారే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పడంతో డాక్టర్లు తనకు సర్జరీ నిర్వహించి పాలిప్స్ రిమూవ్ చేశారని చిరంజీవి వెల్లడించారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతోనే తాను బతికాను అని, క్యాన్సర్ విషయాన్ని చెప్పడానికి తాను భయపడడం లేదని చిరంజీవి తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుందని చిరంజీవి పేర్కొన్నారు.

YES9 TV