ఆదిపురుష్ బిజినెస్ డీటైల్స్ చూడండి !

బాహుబలి విడుదల కాకముందు ప్రభాస్ మార్కెట్ కేవలం టాలీవుడ్ కే పరిమితం అన్నట్టు ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మార్కెట్ విస్తరించింది.

పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ సంపాదించాక ప్రభాస్ తో సినిమా చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శకులు నిర్మాతలు పోటీపడే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్” అనే సినిమా చేయడం తెలిసిందే.

Prabhas View Adipurush Business Details
రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్.. మరియు పాటలకి వస్తున్నా రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి. దీంతో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు ఓ రేంజ్ లో పోటీ పడుతున్నారు. అనేక భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ బిజినెస్ ధరకు “ఆదిపురుష్” థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అమ్మినట్లు న్యూస్ లీక్ అయింది.

YES9 TV