మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), మేడిపల్లి లేఅవుట్‌ల సమీపంలోని 218 ప్రైమ్ ప్లాట్‌ల ఈ-వేలం వచ్చే సోమవారం చేపట్టారు.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టారు. బాచుపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.25వేలు, మేడిపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.32వేలుగా మహానగర పాలక సంస్థ నిర్ణయించింది.
మన్నెగూడ, మునగనూరు, కవాడిపల్లి, చందానగర్‌లోని 373 నివాస స్థలాల ఇ-వేలం జూన్ 12 నుండి 21 వరకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC), HMDA సహకారంతో చేపట్టనుంది. మన్నెగూడలో 166 ప్లాట్లు ఉండగా, గజం కనీస ధర రూ.30 వేలుగా ఖరారు చేశారు. మునగనూరులో 152 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.20 వేలుగా, కవాడిపల్లిలో 52 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.10 వేలుగా, చందానగర్ లో 3 ప్లాట్లకు గాను గజం కనీస ధర రూ.40 వేలుగా నిర్ధారించారు.
ఈ వేలం ద్వారా రూ. 450-రూ. 500 కోట్ల వరకు ఆదాయం రానుంది. అయితే రంగారెడ్డి జిల్లాలోని షాబాద్, మోకిలలో ప్లాట్‌ల మరో ఈ-వేలం నిర్వహించాలని HMDA యోచిస్తోంది. ఈ-వేలానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
HMDA ఈ ప్లాట్‌లను వేలం వేసే బాధ్యతను భారత ప్రభుత్వ సంస్థ అయిన MSTC లిమిటెడ్‌కు అప్పగించింది. ప్రతి ప్లాట్‌కు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) రూ. 50,000 నుంచి రూ. 3 లక్షల వరకు ఉంటుంది.
దీనికి సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశాలు జూన్ 2 నుంచి 9 వరకు జరగనున్నాయి. HMDA ప్రకారం, వేలం కింద ఉన్న ప్లాట్లు తక్షణ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి వివాదాలు లేవు. మంచి రహదారి కనెక్టివిటీ, ప్రాథమిక సౌకర్యాలు కలిగి ఉన్నాయి. 100 శాతం స్పష్టమైన హామీ ఉన్న ప్రభుత్వ భూమి అని అధికారులు చెబుతున్నారు. వేలం తర్వాత విక్రయించబడని ప్లాట్లను 2BHK గృహాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో అవసరాన్ని బట్టి వినియోగిస్తామని తెలిపారు.
