Latest Posts

ఐపీఎల్ లో ‘చేజింగ్ కింగ్’ముంబై ఇండియన్స్!

పీఎల్ దిగ్గజం, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ తనకు తానే సాటిగా నిలిచే ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్ 16 సీజన్ల చరిత్రలో అతిగొప్ప రికార్డులు, లేదా అత్యంత చెత్త రికార్డులు నెలకొల్పడంలో ముంబై ఇండియన్స్ కి ముంబై ఇండియన్స్ మాత్రమే సాటి.

 

2022 ( ఐపీఎల్ -15 ) సీజన్లో లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయినా…ప్రస్తుత 16వ సీజన్ మొదటి 10 రౌండ్లలో పడుతూ లేస్తూ తన ప్రస్థానం కొనసాగించినా..11వ రౌండ్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ను 6 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానానికి చేరుకోగలిగింది. 10వ రౌండ్ పోటీలు ముగిసే నాటికి లీగ్ టేబుల్ 8వ స్థానంలో కొనసాగుతూ వచ్చిన ముంబై..ఆ తర్వాత ఒక్క గెలుపుతో ఏకంగా ఐదుస్థానాల మేర ఎగబాక గలిగింది.

చేజింగ్ లో సూపర్ ముంబై…

ప్రస్తుత ఐపీఎల్ 10 జట్ల లీగ్ లో నిలకడలేమికి మరో పేరుగా ముంబై నిలిచింది. అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్, అత్యంత బలహీనమైన బౌలింగ్ ఎటాక్ తో ముంబై ప్లే-ఆఫ్ రౌండ్ దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోంది.

ఓ వైపు బలహీనమైన బౌలింగ్, మరోవైపు కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస వైఫల్యాలు ముంబైని సాదాసీదా జట్టుగా నిలబెట్టాయి. యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయాలతో అందుబాటులో లేకపోడంతో పేస్ బౌలింగ్ విభాగం బలహీన పడిపోయింది. ఇక..కీలక స్పిన్ బౌలింగ్ విభాగంలో

వెటరన్ పియూష్ చావ్లా జట్టు భారాన్ని తన భుజాలపైన వేసుకొని పర్వాలేదని పిస్తున్నాడు.

ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నా..మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు సూపర్ హిట్టర్లు కామెరూన్ గ్రీన్,

టిమ్ డేవిడ్ తో పాటు మేడిన్ ఇండియా కుర్రబ్యాటర్లు తిలక్ వర్మ, నెహాల్ వడేరా జట్టును ఆదుకొంటూ రావడమే కాదు..కీలక విజయాలు అందిస్తూ వచ్చారు.

YES9 TV