Latest Posts

23 కోట్ల టార్గెట్.. 2 వారాల్లో సంచలన వసూళ్లు.. లాభాలతో టాప్ రికార్డు

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్ ఇలా అన్నింట్లోనూ రాణించడంతో పాటు సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను తనదైన రీతిలో అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.

బ్యాగ్రౌండ్ ఉన్నా కష్టపడుతూ తనలోని నటుడిని మరింతగా బయటకు తీసుకు వస్తున్నాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న వెంటనే ఈ మెగా హీరో ‘విరూపాక్ష’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘విరూపాక్ష’ 2 వారాలకు ఎంత వసూళ్లు సాధించిందన్న రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

హర్రర్ స్టోరీతో వచ్చిన మెగా హీరో:సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రమే ‘విరూపాక్ష’. కార్తీక్ దండు రూపొందించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు.

విరూపాక్ష బిజినెస్ వివరాలివే:సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన ‘విరూపాక్ష’కు నైజాంలో రూ. 7.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.70 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ జరిగింది.

14వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో ‘విరూపాక్ష’ మూవీకి 14వ రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 46 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

YES9 TV