Latest Posts

గోపిచంద్ మాస్ బాక్సాఫీస్.. లెక్క ఎలా ఉండబోతోందంటే..?

మాస్ యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న గోపీచంద్ ఎంతో కాలంగా ఒక బిగ్ హిట్స్ సొంతం చేసుకోవాలి అని చూస్తున్నాడు.

ఇక రామబాణం సినిమా తో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ కెరీర్ లో మంచి విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు లక్ష్యం లౌక్యం. ఇక మళ్లీ ఆ సినిమాల దర్శకుడు శ్రీవాస్ తెరపైకి తీసుకువచ్చిన ఈ రామబాణం సినిమా శుక్రవారం గ్రాండ్ గాన విడుదలైంది. ఇక ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో అయితే పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. ఇక ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవచ్చు అని వివరాల్లోకి వెళితే..

మంచి సక్సెస్ అందుకోవాలని..:రామబాణం సినిమాతో ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని గోపీచంద్ చాలా కసిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఆర్గానిక్ ఫుడ్ నేపథ్యంలో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా డింపుల్ హయతి నటించగా జగపతిబాబు హీరో సోదరుడి పాత్రలో కనిపించాడు.

బాక్సాఫీస్ టార్గెట్: ఇక రామబణం సినిమాకు కొంత హైప్ క్రియేట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే విడుదల చేశారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 620 కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా ప్రపంచవ్యాప్తంగా 840 థియేటర్లలో ఈ సినిమా మొదటి రోజు సందడి చేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద రామబాణం సినిమా 14.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.20 కోట్లకు సెట్ అయింది.

YES9 TV