తెలుగు తెరపై ఇతర భాషల హీరోయిన్లదే క్రేజ్ అంతా. భాష రాకపోయినా అచ్చీ రానీ తెలుగుతో బాగానే ఆకట్టుకుంటారు. అయితే కొన్ని సార్లు వీరి మాటలు చాలా నవ్వు తెప్పిస్తుంటాయి.
వారి అభిప్రాయం మంచిదే అయినా వారు వాడే పదాల వల్ల డబుల్ మీనింగ్స్ వస్తుంటాయి.
తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ హీరోయిన్ డైరెక్టర్ తో నేను నిన్ను ఉంచుకుంటా అనడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ఏకంగా ఆ హీరోయినే ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఆ హీరోయిన్ పేరు మాళవిక నాయర్. ఆ డైరెక్టర్ పేరే.. ఇంకెవరో కాదు క్రేజీ డైరెక్టర్ కేవీ అనుదీప్. ఇద్దరూ కలిసి మెట్లు దిగుతున్న సమయంలో నువ్వేం అనుకోకు.. నేను నిన్ను ఉంచుకుంటా అంటూ మాళవిక అనడం విశేషం.
ఎవడే సుబ్రహ్మణ్యం, ట్యాక్సీవాలా, మహానటి లాంటి మూవీస్ లో నటించింది మాళవిక నాయర్. తన అందంతో, అభినయంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జాతిరత్నాలు లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ అనుదీప్.
నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని అనుదీప్ తో మాళవిక అంటుంది. దానికి బదులిచ్చిన డైరెక్టర్ అనుదీప్ హా చెప్పండి అని సమాధానమిస్తాడు. ఏం అనుకోవద్దు మరి అని హీరోయిన్ మాళవిక అనుదీప్ తో అంటుంది. దానికి కేవీ అనుదీప్ నేనేం అనుకోను చెప్పండి అని అంటాడు. వెంటనే మాళవిక మాట్లాడుతూ నిన్ను ఉంచుకుంటాను అబ్బాయ్ అంటుంది. మాళవిక అలా అనడంతో డైరెక్టర్ అనుదీప్ తెగ సిగ్గు పడుతుంటాడు.
ఇప్పుడు వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా హీరోయిన్ మాళవికనే తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనికి మాళవిక అలా అనుదీప్ గారిని కూడా ఉంచుకోవడం జరిగింది అంటూ క్యాప్షన్ ఇవ్వడం తెగ్ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
