Latest Posts

అల్లరోడి నట ఉగ్రరూపం.. హైలెట్‌ యాక్షన్ సీన్స్.

రేటింగ్: 2.75 /5

టైటిల్: ఉగ్రం

టీనటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శతృ, శరత్ లోహితశ్వ తదితరులు

ప్రొడక్షన్ బ్యానర్: షైన్ స్క్రీన్ బ్యానర్

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

కథ: తూమ్ వెంకట్

మాటలు: అబ్బూరి రవి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జే

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల

విడుదల తేది: నవంబర్ 18, 2022

కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ప్రత్యేకమైన పాపులారిటీ సంపాందించుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఆయన ఇటీవల కాలంలో ఎక్కువగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అందులో భాగంగానే నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలు చేశాడు. ఇప్పుడు తాజాగా నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో మరోసారి అల్లరి నరేష్ నటించిన చిత్రమే ఉగ్రం (Ugram 2023). ఇంతకు ముందు కితకితలు మూవీలో కామెడీ పోలీసుగా చేసిన అల్లరి నరేష్ తాజాగా పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నటించిన ఉగ్రం మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

శివ కుమార్ (అల్లరి నరేష్) ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్థులను ఏమాత్రం విడిచిపెట్టని శివ కుమార్ తాను ప్రేమించిన అమ్మాయి అపర్ణ (మిర్నా మీనన్)ను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికి పాప లక్కీ పుడుతుంది. అటు డ్యూటీ, ఇటు ఫ్యామిలీ మ్యానేజ్ చేసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ కేసు విషయంలో ప్రత్యర్థుల కారణంగా భార్యా బిడ్డలను వాళ్ల తండ్రి (శరత్ లోహితశ్వ) ఇంట్లో డ్రాప్ చేసేందుకు కారులో వెళ్తుంటారు. అప్పుడే వీరికి యాక్సిడెంట్ అవుతుంది.

ట్విస్టులు

కారు యాక్సిడెంట్ లో నుంచి బయటపడిన శివ కుమార్ కు లేనిది ఉన్నట్లు ఊహించుకుంటాడు. మరోవైపు అతని భార్యా బిడ్డలు కూడా మిస్ అవుతారు. ఈలోపు నలుగురి చంపిన కారణంగా శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితులో తన భార్యా బిడ్డలను శివ కుమార్ కాపాడుకున్నాడా? లేదా? వాళ్లతోపాటు సిటీలో వయసుతో సంబంధం లేకుండా మిస్ అవుతున్నవాళ్లకు కారణం ఎవరు? శివ కుమార్ ను హౌజ్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? తను ప్రేమించిన అమ్మాయితో తండ్రితో శివ కుమార్ కు ఉన్న వైరం ఏంటీ? అనే తదితర అంశాలను వెండితెరపైనే చూడాలి.

విశ్లేషణ:

నాంది తర్వాత విజయ్ కనకమేడల-అల్లరి నరేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఉగ్రంపై కాస్తా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో కాకుండా అబౌవ్ యావరేజ్ రీచ్ అయ్యారు. కారు యాక్సిడెంట్ తో సినిమాను ప్రారంభించి మంచి ఇంటెన్స్ క్రియేట్ చేశారు. తర్వాత యాక్సిడెంట్ కు కారణాలు, శివ కుమార్ మానసిక పరిస్థితి తెలుపుతూ కథలోకి వెళ్లారు.

YES9 TV