కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
అయితే కిషన్ రెడ్డి ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. కాగా ఛాతి నొప్పి కారణంగా కిషన్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే.
