తెలుగు యూట్యూబర్ దీప్తి సునైనా ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టంట్ గా వెళ్లిన దీప్తి సునైనా అప్పటి నుంచి మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపించిన అమ్మడు బిగ్ బాస్ సీజన్ 5 లో అతను సిరితో క్లోజ్ గా ఉండటాన్ని జీర్ణించుకోలేని దీప్తి అతనికి బై బై చెప్పేసింది. షణ్ముఖ్ కూడా దీప్తికి దూరమయ్యాడు. షణ్ముఖ్ దీప్తి ఇద్దరు విడిపోయాక ఎవరి దారి వారు చూసుకున్నారు. షణ్ముఖ్ వరుస వెబ్ సీరీస్ లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంటే దీప్తి సునైనా మాత్రం ఫోటో షూట్స్ కి పరిమితమైంది. దీప్తి సునైనా ఫోటో షూట్స్ ఆమె ఫాలోవర్స్ కి మంచి ట్రీట్ అందిస్తున్నాయి. లేటెస్ట్ గా అమ్మడు తన క్రేజీ లుక్స్ తో అలరిస్తుంది. అయితే దీప్తి సునైనా హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయట్లేదు అన్న డిస్కషన్ మొదలైంది. దీప్తి ఫ్యాన్స్ అంతా ఆమెను వెండితెర మీద హీరోయిన్ గా చూడాలని అనుకుంటున్నారు. కానీ దీప్తి మాత్రం అందుకు అయిష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా ఫోటో షూట్స్ చేయడం కన్నా హీరోయిన్ గా చేయొచ్చు కదా అని ఆమెని రిక్వెస్ట్ చేస్తున్న వారు ఉన్నారు. ఏది ఏమైనా దీప్తి ఫాలోవర్స్ కోరిక ఆమె తీరుస్తుందా లేదా అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది.
