ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో సారి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. లెగస్సి వెరిఫైడ్ అకౌంట్ లపై బ్లూ టిక్ లను తొలగించబోతున్నట్లుగా ప్రకటించిన మస్క్ అన్నట్లుగానే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల యొక్క బ్లూ టిక్ మార్కును తొలగించడం జరిగింది.
బ్లూ టిక్ కోల్పోయిన ఇండియన్ సెలబ్రెటీల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని, రజినీకాంత్, సల్మాన్ ఖాన్ ఇలా ఎంతో మంది తమ బ్లూ టిక్ మార్క్ లను కోల్పోయారు.
వీరు తిరిగి ఆ బ్లూ టిక్ మార్క్ ని పొందాలంటే ప్రత్యేకంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని ట్విట్టర్ అధికారికంగా పేర్కొంది. మరి తిరిగి వీళ్లు తమ బ్లూ టిక్ మార్క్ ని తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ట్విట్టర్ ఇప్పుడు ఈ పనితో మరింతగా వివాదాస్పదం అవ్వబోతుంది.
