తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిందని..
ఆయన చివరకు రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నాడు అంటూ బండి అన్నాడు.
నవంబర్ లో బీఆర్‌ఎస్ కథ సమాప్తం అవ్వబోతుంది. జనాలు బీఆర్‌ఎస్ కి తగిన బుద్ది చెప్పేరోజులు రాబోతున్నాయి. నవంబర్ లో కేసీఆర్ రిటైర్ అవ్వబోతున్నాడు. గత కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్ కు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ కి కూడా తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్తారని బండి హెచ్చరించాడు.
పక్క రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు యాత్రలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశాడు. గతంలో కూడా పలు సార్లు కాంగ్రెస్ మరియు బీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల్లో పని చేశాయి అంటూ బండి ఆరోపించాడు.
