Latest Posts

కామాంధుడు వైఎస్ వివేకానంద రెడ్డి.! అంతేనా.?

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యమేంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డిని ‘కామాంధుడి’గా చూపించడంలో వైసీపీ వ్యూహమేంటి.?

వైసీపీ శ్రేణులకు సైతం అర్థం కాకుండా పోతోందిప్పుడు.!

ఆయన గతంలో ఎంపీగా పని చేశారు, మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. పైగా సౌమ్యుడు.! వైఎస్ వివేకానంద రెడ్డి ఎంత సౌమ్యుడో పలు సందర్భాల్లో స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.

వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైతే, దాన్ని తొలుత గుండె పోటుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అది హత్య అని తేలిపోయాక, ఆ హత్య చేయించింది చంద్రబాబేనంటూ వైసీపీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పుడేమో, కుటుంబ సమస్యల కారణంగా జరిగిన హత్య.. అంటోంది వైసీపీ.

చిత్రంగా వైఎస్ వివేకానంద రెడ్డికి మతం మార్చేశారు.. ఆయనకు రెండో భార్యను తీసుకొచ్చారు.. పనిలో పనిగా ఓ వారసుడ్నీ చూపిస్తున్నారు. అక్కడితో ఆగారా.? సదరు ముస్లిం మహిళ కాకుండా, మరో ఇద్దరితో వైఎస్ వివేకానంద రెడ్డికి అక్రమ సంబంధం అంటగడుతున్నారు.

నాలుగేళ్ళ తర్వాత బతికొచ్చి, ‘నేను అలాంటోడ్ని కాదు మహాప్రభో..’ అని కోర్టు ముందర వైఎస్ వివేకానంద రెడ్డి తన నిజాయితీని నిరూపించుకోలేరు కదా.! ఏ వివేకానంద రెడ్డిని గొప్పవాడు.. అంటూ విగ్రహాలు ఆవిష్కరించి, పాలాభిషేకాలు కూడా చేశారో.. ఆ వివేకానంద రెడ్డి ఇప్పుడు వైసీపీ దృష్టిలో కామంధుడు.!

ఇప్పటికి ముగ్గురితో అక్రమ సంబంధాలు అంటగట్టేశారు వైఎస్ వివేకానంద రెడ్డికి. ముందు ముందు ఈ లిస్టు ఇంకెంత పెరుగుతుందో.! ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో అదృష్టవంతుడు.. ఆయన మీద ఇలాంటి అభాండాలు మోపలేదు మరి..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్.!

Posted Under AP
YES9 TV