భీమ్లా నాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంయుక్త మీనన్ ఆ తర్వాత బింబిసార మరియు సార్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
తెలుగు లో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో లక్కీ బ్యూటీ అంటూ ఈమెకు పేరు దక్కింది. ఈ సమయంలో ఈమె మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న విరూపాక్ష సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సంయుక్త మీనన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
లుక్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో నాది ఒక పల్లెటూరు అమ్మాయి పాత్ర. చాలా యాటిట్యూడ్ చూపిస్తూ పొగరుగా ఉండే పాత్ర నాది. ఆ పాత్ర లో నేను నటించే క్రమంలో హెయిర్ స్టైల్ నుండి మొదలుకని ప్రతి ఒక్క విషయంలో కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుకుమార్ గారు ప్రీ రిలీజ్ వేడుకలో లుక్ చాలా బాగుంది అంటూ ప్రశంసించారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం సినిమాటోగ్రాఫర్ కూడా అనడంలో సందేహం లేదు.
ఈ సినిమాలోని పాత్రకు రియల్ లైఫ్ కు సంబంధం ఉందా.
విరూపాక్ష సినిమాలో నేను పోషించిన నందిని పాత్రకు.. నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కు అస్సలు సంబంధం లేదు. నేను నందినికి పూర్తి విభిన్నంగా ఉంటాను. అయితే నందిలో ఉండే ఎనర్జీ మాత్రం నాకు ఉంటుంది. అంతకు మించి నందిని పాత్ర తో నా రియల్ లైఫ్ కి పోలిక లేదు.
బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) గురించి..
బ్లాక్ మ్యాజిక్ గురించి విన్నాను.. కానీ నేను దాన్ని నమ్మను.
కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్..
ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా నా నటన గురించి మరియు సినిమా గురించి చాలా నమ్మకంతో ఉన్నాను. అందుకే ఇది నా కెరీర్ బెస్ట్ గా చెప్పుకుంటున్నాను. అయితే నాకు నేను బాగానే చేశానా. ఇంకా బాగా చేయాలి కదా అని చెప్పుకుంటాను. ప్రతి సినిమాకు సన్నివేశానికి బెటర్ అవ్వాలని అనుకుంటూ ఉంటాను. షూటింగ్ పూర్తి అయిన రోజు కెమెరా మెన్ నాతో చాలా బాగా చేశారంటూ చెప్పడం సంతోషంగా అనిపించింది.
షూటింగ్ సమయంలో సాహసాలు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫైర్ కు దగ్గరగా ఉండి సన్నివేశాలు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా చాలా సన్నివేశాల్లో సాహసం చేయాల్సి వచ్చింది. చాలా సార్లు యాక్సిడెంట్స్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చాలా డేంజర్ పరిస్థితుల్లో సన్నివేశాల చిత్రీకరణ చేశాం.
బింబిసార సమయంలోనే ‘విరూపాక్ష’ సైన్.
బింబిసార సినిమా నాకు తెలుగు లో మొదటి సినిమా. ఆ సినిమా సైన్ చేసిన రెండు వారాలకే విరూపాక్ష సైన్ చేశాను. అప్పటి నుండి కూడా వర్క్ షాప్ లో పాల్గొన్నాను. అప్పటి నుండి సినిమాలో.. పాత్రలోనే ఉన్నాను. అప్పుడు తెలుగు నాకు రాదు. డైలాగ్స్ పేపర్ చూసి షివరింగ్ వచ్చింది. అప్పుడే తెలుగు నేర్చుకోవాలి అనుకున్నాను.
సుకుమార్ గారి సలహాలు.
ఈ సినిమాకు ఒక నిర్మాత అయినా కూడా సుకుమార్ సర్ ను నేను షూటింగ్ సమయంలో ఎప్పుడు కూడా కలవలేదు. ఆయన్ను మొదటి సారి ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలోనే కలిశాను. ఆయన షూటింగ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వారట.
విరూపాక్ష జోనర్..
