“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు శ్రీరామ్ కి ఆ వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా ఓకే అయింది. కానీ ఆ సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. చాలాసార్లు వేణు శ్రీరామ్ సినిమా కథ ను బన్నీకి వినిపించారు.
కావాల్సినట్లుగా మార్పులు కూడా చేశారు. కానీ ఎంత చేసినా బన్నీకి కథ మాత్రం నచ్చకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత వేణు శ్రీరామ్ యువ హీరో రామ్ పోతినేని కి కథను వినిపించారు. కథ బానే ఉంది అన్నారు కానీ రామ్ పూర్తిగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. అలా కొంతకాలం పాటు రామ్ పోతినేని వద్ద ఎదురు చూసిన వేణు శ్రీరామ్ ఈ మధ్యనే నితిన్ కి కథను వినిపించారట.
గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతం అవుతున్న నితిన్ ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలా అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా ఇప్పుడు నితిన్ చేతుల్లో పడింది. మరి ఐకాన్ స్టార్ కాకుండా “ఐకాన్” సినిమాతో నితిన్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమా హిట్ అవ్వటం డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి కూడా చాలా అవసరం అని చెప్పుకోవాలి. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన మరియు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
