రానా నాయుడు ఓ బూతు వెబ్ సీరీస్..?

అబ్బాయ్‌, బాబాయ్‌ రానా, వెంకటేశ్‌లు తొలిసారి కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్‌ మొదటి సారి ఒక వెబ్‌ సిరీస్‌లో నటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. వెంకీ ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సిరీస్‌ అందరినీ ఆకట్టుకుకోలేక పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ కంటెంట్‌ శృతి మించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో దీనిపై ఏకంగా రానా స్పందించాల్సి వచ్చింది. ఇది కేవలం 18 ఏళ్లు నిండిన వారికే అని స్పష్టత కూడా ఇచ్చారు.

 

ఇక ఈ వెబ్‌ సిరీస్‌ను కుటుంబంతో కలిసి చూడడం కష్టమని ప్రేక్షకులు సైతం అంటున్నారు. ముఖ్యంగా శృతి మించిన శృంగార సన్నివేశాలు, భూతులు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది మీమర్స్‌కి సైతం సోర్స్‌గా మారింది. ఇంకేముంది రానా నాయుడిపై తమదైన శైలిలో మీమ్స్ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. రానా నాయుడి సిరీస్‌ని కుటుంబంతో కలిసి చూస్తే ఏమవుందో తెలుసా.? అంటూ రకరకాల ఫన్నీ మీమ్స్‌ను క్రియేట్‌ చేశారు.

Editor