ప్రస్తుతం అంతా తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్నసంగతి తెలిసిందే.
అందులో భాగంగా మార్చి4న చిరంజీవి గ్యాంగ్ లీడర్ కూడా విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ కూడా మార్చి 4న విడుదలకావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రీరిలీజ్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. కారణాలు తెలియాల్సి ఉంది. ఇక సినిమా విడుదల వాయిదా పడడంతో ఆయన ఫ్యాన్స్ కాస్తా అప్ సెట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు.. నయనతార, షీలా హీరోయిన్స్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. Photo : Twitter
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు ఎన్టీఆర్. 2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయ్యింది. మార్చి 12న విన్నర్స్‌కు ఆస్కార్ అవార్డులు ప్రధానం చేస్తారు..అందులో భాగంగా ఎన్టీఆర్ మార్చి 5న అమెరికా ప్రయాణం చేయనున్నారు.
