పెళ్లి తర్వాత దూకుడు పెంచిన కాజల్ ప్రస్తుతం ఓ ఐదు సినిమాల్లో నటిస్తోంది. కరుంగాపియం, పారిస్ పారిస్.. క్వీన్ రీమేక్, ఘోస్టీ వంటి తమిళ సినిమాలు చేస్తోంది. వీటికితోడు ఉమా అనే ఓ హిందీ సినిమా చేస్తోంది. ఇవే కాకుండా.. ఇండియన్ 2 అనే ప్యాన్ ఇండియన్ చేస్తోంది. ఇక లేటెస్ట్‌గా బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమా చేస్తోంది చందమామ. కాజల్ తెలుగులో బాలయ్య 108 విషయానికి వస్తే.. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దరు బాలయ్యలు ఉంటారట. దీంతో సీనియర్ బాలయ్య సరసన కాజల్ నటించనుందని వీరికి కూతురుగా శ్రీలీల కనిపించనుందని లేటెస్ట్ టాక్. కాగా ఈ సినిమాలో కాజల్ నటించడానికి భారీగా డిమాండ్ చేస్తోందట. Photo : Twitter ఆమె అడిగిన మొత్తాన్ని కూడా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి కాజల్‌కు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆగస్టు 15కు రానుందని టాక్. Photo : Twitter కాజల్‌కు మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు చంద్రముఖి2 సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు పి వాసు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా 2005లో విడుదలైన రజనీకాంత్ చంద్రముఖికి అధికారిక సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రం ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. Photo : Instagram
పెళ్లి తర్వాత మరింత దూకుడుగా చందమామ..
