Dhanush కు ట్రాన్స్‌లేటర్‌గా మారిన త్రివిక్రమ్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ వేదికపై ఉన్నా తన మాటలతో గారడీ చేస్తుంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే సార్ (వాతి) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ తన మాటలతో మ్యాజిక్ చేశారు. ధనుష్ తమిళం, తెలుగులో మాట్లాడుతుంటే.. త్రివిక్రమ్ ట్రాన్స్‌లేటర్‌గా మారిపోవడం విశేషంగా మారింది. ధనుష్, త్రివిక్రమ్ మధ్య సరదా సంభాషణ ఎలా సాగిందంటే.. త్రివిక్రమ్ తన స్పీచ్‌ను కొనసాగిస్తూ.. ధనుష్ లాంటి నటుడిని తెలుగు సినిమా రంగంలోకి ఆహ్వానించే అదృష్టం మాకు దక్కింది. గతంలో డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు పరిచయం. కానీ తొలి అడుగు బలంగా పడాలని అంటారు. తెలుగులో సార్ సినిమా ద్వారా బలంగా అడుగు పడబోతున్నది.

ఆయనను తెలుగు పరిశ్రమకు ఆహ్వానించే అవకాశం దక్కడం చాలా హ్యాపీగా ఉంది అని పొగడ్తల వర్షం కురిపించారు. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రతీ రోజు ఇంట్లో సాయంత్రం నేను వంట చేస్తుంటాను. ఈ రోజు ఈవెంట్‌కు నేను రావడం వల్ల ఆమె ఈ ఫంక్షన్‌కు రాలేకపోయింది. ఆమె తరఫున నేను ఇక్కడికి వచ్చాను అంటూ సరదాగా మాటలు చెప్పారు. ధనుష్ మాట్లాడుతుంటే.. ఆయనకు కొంచెం తెలుగు వచ్చంటా. ఆయనకు నేను అనువాదకుడిగా మారుతాను. ఆయన ట్రాన్స్‌లేట్ చేయడం కంటే.. నాకు తమిళం ఎంత వస్తుందనే విషయం ఈ రోజుతో తేలిపోతుంది అని తనమీద తానే సెటైర్ వేసుకొన్నాడు. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది మీ సినిమా అని ధనుష్ చెప్పాడని తివిక్రమ్ అనువాదం చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది

Editor