ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలీమ్స్ రిజల్ట్ 2022 డైరెక్ట్ లింక్

ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌ ibps.in లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి లేదా డైరెక్ట్ లింక్ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్ ఈ విధంగా చెక్ చేసుకోండి ముందుగా ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in విజిట్ చేయండి. హోమ్ పేజీలో ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ రిజల్ట్ 2022 అనే లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. మీ ఐబిపిఎస్ ఎస్ఓ ప్రిలిమ్స్ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. రిజల్ట్ చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసిన కాపీని పదిలంగా భద్రపర్చుకోండి. నేటి నుంచి జనవరి 25వ తేదీ వరకు ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రిలీమ్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్స్ ఎగ్జామ్ తేదీ: ఐబిపిఎస్ ఎస్ఓ మెయిన్స్ 2022 పరీక్ష జనవరి 29 న జరగనుంది. ఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఐబిపిఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

Editor