Latest Posts

అవతార్ 2.. 3వారాల్లో అన్ని వేల కోట్లు..

మిగిలిన వాటితో పోల్చుకుంటే హాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. విజువల్స్, టెక్నాలజీ వంటి వాటిలో ఉన్నతంగా రూపొందే ఈ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతుంటుంది. అందుకే ఆ తరహా మూవీలకు కలెక్షన్లు భారీ స్థాయిలో దక్కుతోన్నాయి. ఇలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరిట రెండో భాగాన్ని రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘అవతార్ 2’ 3 వారాల్లో ఇది ఎంత రాబట్టిందో మీరే చూడండి! టెక్నికల్ వండర్‌గా అవతార్ 2 హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యమే ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’. మొదటి భాగంలో నటించిన వాళ్లతోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించారు.

విజువల్ వండర్‌గా దాదాపు 350 – 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అంచనాలతో ఎక్కువ లొకేషన్లలో విడుదలైంది. భారీ రిలీజ్.. బిజినెస్ కూడా సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ గత రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ఇండియాలోనూ ఈ మూవీ భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ చేసుకుంది. దీంతో ఇండియా వ్యాప్తంగా ఇది ఎక్కువ థియేటర్లలో విడుదలైంది. దీంతో ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 21వ రోజు తెలుగు వసూళ్లిలా సరికొత్త టెక్నాలజీతో రూపొందిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీకి తెలుగులోనూ భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసి లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇక, 21వ రోజైన గురువారం కూడా ఈ సినిమా ఏవరేజ్‌గానే వసూలు చేసింది. ఫలితంగా దీనికి తెలుగులో రూ. 1.04 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

Editor