- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. గ్రామ అభివృద్ధే నా లక్ష్యం
- అత్యధిక మెజార్టీతో గెలిపించిన గోవిందవాడ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటా : ఎంపీటీసీ సోమనాథ్ గౌడ్
బొమ్మనహాల్, నవంబరు 10 YES 9 TV News ,
మండలం లోని గోవిందవాడ గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి ఎంపీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానని నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సోమనాథ్ గౌడ్ అన్నారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సోమనాథ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ, గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
బొమ్మనహాల్ మండల వ్యాప్తంగా పసుపు జెండా రెపరెపలాడడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజల ఆదరణతో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుతానన్నారు. ఈ సందర్భంగా గోవిందవాడ గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
