Latest Posts

పెనుకొండలో హృదయ విదారకం….ఐదుగురు మహిళల దుర్మరణం

 

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో హృదయాన్ని కలిచివేసే విషాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్ లో ఈతకు వెళ్లిన ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రిజర్వాయర్ కి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నీటి లోతు తెలియక లోపలికి వెళ్లడంతో బురదలో చిక్కుకుని బయటకు రాలేక ఒక్కొక్కరుగా నీటిలో మునిగిపోతుంటే కాపాడేందుకు ఎవరూ లేకపోవడం అత్యంత బాధాకరం ఘటన.సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రిజర్వాయర్ వద్దకు పరుగులు తీయగా అప్పటికే అంతా ముగిసిపోయింది. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. ఒక్కసారిగా ఐదుగురు మహిళలు లేకపోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర శోకం వెల్లువెత్తుతోంది. చిన్నారులు తల్లుల కోసం వెతుకుతున్న దృశ్యం చూసి స్థానికులు సైతం కన్నీరు ఆపుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలిస్తున్నారు.

Posted Under AP
Editor