అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటానికి ప్రధాన కారణం లేబర్ షార్టేజ్. ఈ విషయాన్ని ప్రకటించింది స్వయంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎటార్నీ రాబర్ట్ వెబర్. జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే డేటాపై ఆయన స్పందించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం 10.3 మిలియన్ల ఖాళీలున్నాయి. అంటే ఉద్యోగం కోసం ఎదురుచూసే ప్రతి అమెరికన్‌కు 1.7 ఉద్యోగాలున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రకారం లేబర్ షార్టేజ్‌కు మూడు కారణాలున్నాయి. మొదటిది భారీ సంఖ్యలో రిటైర్మెంట్లు కాగా రెండవది కోవిడ్ మరణాలు. ఇక మూడవది ఇమ్మిగ్రేషన్ పడిపోవడం.
నికర ఇమ్మిగ్రేషన్ పడిపోవడం, కరోనా మహమ్మారి సమయంలో భారీగా మరణాల వల్ల 1-1.5 మిలియన్ వర్కర్లు మిస్ అయ్యారని అంచనా. అమెరికాలో సరైన ఉద్యోగాలు ఎలా ఎంచుకోవడం ట్విట్టర్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీగా ఉద్యోగాలు తొలగించడంతో చాలామంది హెచ్ 1బి సిబ్బంది ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారు. రానున్న నెలల్లో ఇది ఉద్యోగ అణ్వేషణకు కష్టమౌతుంది. యూఎస్‌కు వలస వెళ్లాలనుకుంటే..ఆ దేశంలో చాలా ఉద్యోగాలున్నాయని..కానీ ఆ ఉద్యోగాలు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు అవసరం లేదని అర్ధం చేసుకోవల్సి ఉంటుంది. రెండవది ఎఫ్ 1 విద్యార్ధులు, హెచ్ 1 బి సిబ్బంది ఎక్కువ అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఇతర పరిశ్రమలకు వెళ్లగలగాలి.
ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారని..కానీ ఆరోగ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి ఇతర రంగాల్లో చాలా ఉద్యోగాలున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి హెల్త్‌కేర్ రంగం చాలామందికి ఆకర్షణీయమైన రంగంగా ఉంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా లేదా కెనడా యూనివర్శిటీలకు వెళితే..ఆస్ట్రేలియన్ లేదా కెనడియన్ పౌరులు కావచ్చు కూడా. ఆస్ట్రేలియా, కెనడా పౌరులకు అమెరికాలో ప్రత్యేక వర్క్ వీసాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి భారతీయులకు లభించవు. అయితే ఆస్ట్రేలియా, కెనడాలో చదువుకుని ఎక్కువ కాలముండటం ద్వారా అక్కడి పౌరులైతే..ఈ అమెరికన్ ఇ 3 వీసాలు పొందవచ్చు.
