దారుణంగా తిడుతున్న నెటిజెన్స్..బయటపడ్డ ఇనాయ కన్నింగ్ తెలివితేటలు..

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో చిట్టచివరి కెప్టెన్సీ టాస్కు జరిగింది..’గ్రాబ్ & రన్ ‘ పేరిట బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్కులో ఇనాయ సుల్తానా గెలిచి హౌస్ కి చివరి కెప్టెన్ గా నిలిచి సెమి ఫైనల్స్ లోకి అడుగుపెట్టేసింది..అయితే ఇనాయ ఈ టాస్కుని చాలా కన్నింగ్ తెలివితో పకడ్బందీగా ప్లాన్ ప్రకారం గెలిచింది..టాస్కు రూల్ ప్రకారం సర్కిల్ లో బాల్ ని పట్టుకొని పోటీదారులు కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి..అలా ‘బజర్’ మోగే సమయానికి చివరిగా ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వారికి ఒక కంటెస్టెంట్ ని కెప్టెన్సీ టాస్కు నుండి తప్పించే అవకాశం ఉంటుంది. Bigg Boss 6 Telugu Inaya Sultana ఈ టాస్కు కి ఫైమా సంచాలక్ గా వ్యవహరిస్తోంది..ఒక రౌండ్ లో బజర్ మోగే సమయానికి ఇనాయ చేతిలో బాల్ ఉండడం తో ఆమెకి ఒకరిని తప్పించే అవకాశం వస్తుంది..ఆ అవకాశం వచ్చినప్పుడు రోహిత్ తో సరిసమానంగా ఉన్న శ్రీహాన్ మరియు ఆది రెడ్డి వంటి వారు కెప్టెన్సీ టాస్కు లో ఉన్నప్పటికీ రోహిత్ ని తప్పిస్తుంది. ఇనాయ తో పాటుగానే రోహిత్ కి కూడా ఇప్పటి వరుకు ఇంటికి కెప్టెన్ అయ్యే అవకాశం లేదు..ఆ బాధ ఎలా ఉంటుందో ఇనాయ కి తెలిసి కూడా ఎందుకు ఇలా చేసింది అంటూ నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.

.అలా చెయ్యడానికి కారణం రోహిత్ చాలా బలమైన కంటెస్టెంట్..అతని చేతికి బాల్ వెళ్తే నేను కెప్టెన్ అయ్యే అవకాశం రాదు..అందుకే రోహిత్ ని తొలగిస్తున్నాను అని చెప్పింది..వాస్తవానికి రీజన్ అది కాదు..అసలు రీజన్ ఏమిటి అంటే ఉన్న ఇంటి సభ్యులలో ఇప్పటి వరుకు రోహిత్ మరియు ఇనాయ కి కెప్టెన్ అయ్యే అవకాశం రాలేదు కాబట్టి ఆట లో బాల్ దొరికిన కంటెస్టెంట్స్ కి ఒకరిని తప్పించే అవకాశం వస్తే కచ్చితంగా రోహిత్ మరియు ఇనాయ కి అవకాశం వచ్చేలాగానే చేస్తారు..హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఇనాయ కంటే రోహిత్ అంటేనే ఎక్కువ ఇష్టం. Bigg Boss 6 Telugu Inaya Sultana ఇద్దరు అవకాశం రానోళ్ళలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా ఇంటి సభ్యులు రోహిత్ నే ఎంచుకుంటారు..అందుకే తెలివిగా ఇనాయ తన వంతు రాగానే రోహిత్ ని గేమ్ ని తప్పించేసింది..ఇదే రీజన్ ఆమె నేరుగా చెప్పి రోహిత్ ని తప్పించి ఉంటె ఆమెకి సోషల్ మీడియా లో ఇంత నెగటివిటీ వచ్చేది కాదు..కానీ ఆ రీజన్ ని కప్పివేసి వేరే రీజన్ చెప్పడం వల్లే ఈ నెగటివిటీ..మరి నాగార్జున దీనికి వీకెండ్ లో ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Editor