కత్తెర గుర్తుకు ఓటేయండి.. బక్కిరెడ్డి శివభూషణ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి..!
గెలిపిస్తే బెలుప్పుల గ్రామానికి ఉచిత తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తా.. అభివృద్ధే నా లక్ష్యం అంటున్న వైసీపీ సర్పంచ్ అభ్యర్థి..!
బెలుప్పుల: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెలుప్పుల గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుతో బరిలో నిలిచిన బక్కిరెడ్డి శివభూషణ్ రెడ్డి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, తనను సర్పంచ్‌గా గెలిపిస్తే బెలుప్పుల గ్రామంలో సొంత నిధులు, కృషితో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు.
గతంలో తమ హయాంలో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో బెలుప్పుల గ్రామ ప్రజలు వైసీపీ పార్టీని ఆదరించినట్లుగానే, ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు తెలిపి గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
అన్ని కులాలు, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం..
తాను ఒక్క కులానికి, ఒక్క వర్గానికి పరిమితమైన వ్యక్తిని కాదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సహా అన్ని సామాజిక వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తూ గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని శివభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి ఆశీస్సులు, సహకారం తనకు కావాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో రాజన్న రాజ్యం రావాలనే ఆకాంక్షతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. నవంబర్ 29న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బక్కిరెడ్డి శివభూషణ్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
కత్తెర గుర్తుకే మన ఓటు – బెలుప్పుల గ్రామ అభివృద్ధికి మరో అవకాశం ఇవ్వండి..!
