*భక్తి శ్రద్ధలతో గురప్ప స్వామి బాలాలయం – 2.92 కోట్ల నిధులతో దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం* .పోరుమామిళ్ల, yes 9TV : శ్రీ శ్రీ శ్రీ మద్దిమాను గురప్ప స్వామి దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గురువారం గుడి పునర్ నిర్మాణం సందర్బంగా గర్భగుడిలో వున్న స్వామి వారి మూల విరాట్ ను ప్రక్కనే వున్న అన్నదాన సత్రం లోకి తరలించి ప్రతిష్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రతిరోజూ అక్కడే స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దేవాలయ పున : నిర్మాణం పూర్తి అయ్యేందుకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చునని ఎండోమెంట్ అధికారుల అంచనా… దేవస్థానం ఈవో క్రిష్ణయ్య, ఛైర్మెన్ మల్లికార్జునరెడ్డి, వేద పండితులు, చుట్టు ప్రక్కల గ్రామాల పెద్దలు, ప్రజలు, భక్తులు అత్యంత నిష్టతో, సాంప్రదాయ పద్దతిలో, భక్తి శ్రద్ధలతో వైభవంగా స్వామివారి బాలాలయం నిర్వహించారు. దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం 2.92 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల చేసిన విషయం తెలిసిందే…
భక్తిశ్రద్ధలతో మద్దిమాను గురప్ప స్వామి బాలాలయం: రూ.2.92 కోట్ల నిధులతో ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం!
