Yes 9 TV News
రాయదుర్గంలో జనసంద్రమైన ప్రచారం!
🚲 చైర్మన్ అభ్యర్థి టంక శాల హనుమంతు, 18వ వార్డు అభ్యర్థి డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి ప్రజల మధ్య విస్తృత ప్రచారం!
రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే.. అభివృద్ధి చేసి చూపిస్తాం!
కూటమి ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమంటున్న అభ్యర్థులు!
రాయదుర్గం:
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి టంక శాల హనుమంతు, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీరామ్ రెడ్డి కలిసి జనసందోహం మధ్య విస్తృత ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను కలుసుకుంటూ తమకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థులు కోరారు. చైర్మన్ అభ్యర్థి టంక శాల హనుమంతుకు, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ శ్రీరామ్ రెడ్డికి రెండు ఓట్లు వేసి సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు తమను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని తెలిపారు. రాయదుర్గం పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.
రాయదుర్గంలో జనసంద్రమైన ప్రచారం!
