చైతన్య పాఠశాల టీచర్‌పై కత్తితో దాడి

అనంతపురం

గుంతకల్లులో దారుణం

చైతన్య పాఠశాల టీచర్‌పై కత్తితో దాడి

పాఠశాల ఆవరణలోనే సైన్స్ టీచర్ ఈవూరి అరుణ (44)పై స్కూల్‌కు వెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి.

దాడిలో అరుణ మెడకు ఇరువైపులా తీవ్ర కత్తి గాయాలు..

పాఠశాల వద్ద తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు, విద్యార్థులు.

తిమ్మనచర్ల రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న అరుణ..

రైల్వే శాఖలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న భర్త వెంకటకృష్ణ

సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడింది ఆయుర్వేద డాక్టర్ శ్రీనివాసులుగా ప్రాథమిక గుర్తించిన పోలీసులు

గతంలో పైల్స్ (మొలల) చికిత్స కోసం వెళ్లిన సమయంలో అసభ్యకర ఫోటోలు, వీడియోలతో సదరు డాక్టర్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు అరుణ ఫిర్యాదు.

వేధింపుల వివాదమే ఈ ప్రాణాంతక దాడికి ప్రధాన కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

సీసీటీవీ ఆధారాల ప్రాతిపదికన నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గుంతకల్లు పోలీసుల ప్రత్యేక బృందాల రంగప్రవేశం.

Posted Under AP
yes9tv