నేపాల్ వరదలు.. 22 మంది తెలంగాణవారి ఆచూకీ గల్లంతు

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తెలంగాణకు చెందిన 22 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో తెలంగాణ మూలాలున్న ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు బాధిత కుటుంబాలు, ఇతరుల నుంచి 80 నుంచి 100 వరకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 20 కేసులను గుర్తించి, వారి ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు.

మరోవైపు, నేపాల్ వరదల్లో చిక్కుకున్న డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, ఆయన సతీమణి సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

అయితే మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఎల్బీనగర్‌కు చెందిన కందిమళ్ల సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి మహేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

yes9tv