ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ మలకవేముల పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, నాగేశ్వరి దంపతులు శనివారం నల్లచెరువు సమీపంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమ దివంగత కుమారుడు బండి రూపేంద్ర స్మారకార్థం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి మల్లికార్జున మాట్లాడుతూ, కుమారుడు రూపేంద్ర జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలిపారు. భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమం అనంతరం ఆలయ సిబ్బంది జగదీశ్వర్ బండి మల్లికార్జునను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ జి. ఆదినారాయణ, ఈవో నరసింహారాజు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. కుమారుడు రూపేంద్ర స్మారకంగా అన్నదానం…
