Latest Posts

వేరుశనగ విత్తనం కొరకు రిజిస్ట్రేషన్లు….

ముదిగుబ్బ yes9 TV
వేరుశనగ విత్తనం కొరకు రిజిస్ట్రేషన్లు…
ముదిగుబ్బ మండలం లోని రైతులందరికీ తెలియజేయునది ఏమనగా, రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేటి నుండి సంబంధిత రైతు సేవా కేంద్రాలు (RSKs)లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును.
ముదిగుబ్బ మండలానికి ఈ ఖరీఫ్ సీజన్ కు 5369 క్వింటాళ్ళ వేరుశనగ విత్తనం కేటాయించడం జరిగింది.40% శాతం సబ్సిడీ పై విత్తనం పంపిణీ చేయబడును. సబ్సిడీ పోను వేరుశనగ బస్తా (30 కేజీలు )ధర రూ.1836/-. రైతు కలిగిన విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు గరిష్టంగా 3 బస్తాలు ఇవ్వబడును. వేరుశెనగ విత్తనాలు పొందదలచిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా కోరడమైనది. జిల్లాలో వేరుశెనగ విత్తనాల పంపిణీ త్వరలో ప్రారంభం కానుండగా, రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా విత్తనాల పంపిణీ సజావుగా నిర్వహించుటకు సహకరించగలరు.పచ్చి రొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు కూడా తమ సమీపంలోని రైతు సేవా కేంద్రం లో సంప్రదించవలెను…

Posted Under AP
Editor