Latest Posts

ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిద్దాం వారి భవిష్యత్తుకు బాటలు వేద్దాం..ఎమ్మెల్యే అమిలినేని

*ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిద్దాం వారి భవిష్యత్తుకు బాటలు వేద్దాం..ఎమ్మెల్యే అమిలినేని*

*ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ బదులు..అత్యుత్తమ ఫలితాలు సాధించారు..*

*బడిపిలుస్తోంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*

*ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా త్వరలో 9,10, ఇంటర్ విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేస్తాం*

*అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి త్వరపడండి*

ప్రభుత్వ బడులకు కార్పొరేట్ *ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పిద్దాం వారి భవిష్యత్తుకు బాటలు వేద్దాం..ఎమ్మెల్యే అమిలినేని*

*బడిపిలుస్తోంది కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని*

*అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి త్వరపడండి*

*ప్రభుత్వ బడులకు కార్పొరేట్ స్థాయి అందించిన ఘనత మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు*

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నేడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయని కార్పొరేట్ స్థాయిలో నేడు పది ఫలితాలు సాధించడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు..నేడు కళ్యాణదుర్గం పట్టణం 7వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, డీఈఓ ప్రసాద్ బాబు, సర్వశిక్షాఅభియాన్ పీడీ శైలజ గారు పాల్గొన్నారు..బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నేడు 20 మంది చిన్నారులు అడ్మిషన్ పొందారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని మెరుగైన విద్యను అందించేలా చూస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ ద్వారా నాణ్యమైన బట్టలు, పుస్తకాలు, బ్యాగు షూష్, బెల్ట్, సాక్స్, సన్న బియ్యంతో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ఎంతమంది చదువుతున్న అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం ద్వారా, ప్రత్యేకంగా పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక ద్వారా తల్లిదండ్రులలో పిల్లల్లో చదువు పట్ల శ్రద్ద పెరిగి కార్పొరేట్ స్థాయికి దీటుగా పదవ తరగతిలో ఫలితాలు సాధించారని పేర్కొన్నారు..విద్యాశాఖ అధికారులు ప్రతి నిత్యం పాఠశాలలను తనిఖీ చేయడం విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చూడటం, ఉపాధ్యాయులు కూడా ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్త్యాలను గుర్తించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందు కోసం పనిచేయాలని నియోజకవర్గంలో ఉన్న 9, 10, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు పాఠశాల, కళాశాలకు వెళ్లేందుకు అనువుగా ఎస్సార్సీ ట్రస్ట్ ద్వారా వచ్చే మూడు నెలల్లోగా ఉచితంగా సైకిల్స్ అందించి వారి చదువు కొనసాగించేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు…

Posted Under AP
Editor