వేతన బకాయిలు చెల్లించాలి: నల్లమాడలో సత్యసాయి నీటి సరఫరా కార్మికుల భారీ ర్యాలీ

మా సమస్యలను పట్టించుకోండి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం సత్యసాయి నీటి సరఫరా కార్మిక సంగలు సత్యసాయి పంప్ హౌస్ నుండి నల్లమాడ ఎంపీడీవో ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి తమ డిమాండ్లను పరిష్కరించాలని డిప్యూటీ ఎంపీడీవో మున్ఆఫ్ ఏవో శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది . కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని పిలుపునిచ్చారు 1.సత్యసాయి నీటి సరఫరా పథకమును బోర్డు ఆధీనంలో కొనసాగించాలి. 2.జిల్లా పరిషత్ లో విలీనం చేయవద్దు. 3.1997 నుండి కేటాయించినట్లే రాష్ట్ర బడ్జెట్ నుండి యధావిధిగా బడ్జెట్ కేటాయించాలి. 4.సత్యసాయి నీటి సరఫరా కార్మికులకు గత ఐదు నెలలుగా వేతన బకాయిలు చెల్లించలేదని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్లు చేశారు. అలాగే ఉద్యోగ భద్రత సరైన జీతాలు లేవని కార్మికులు ఆరోపించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు

Posted Under AP
Editor