ఈరోజు ముదిగుబ్బలో మే డే సందర్భంగా స్థానిక సిండికేట్ బ్యాంక్ దగ్గర నుండి సిఐటియు సిపిఎం ఆవాజ్ అంగన్వాడి పంచాయతీ వర్కర్లు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు మనోహర్ గారు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడతామని నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని పాత 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని రాబోవు కాలంలో ఆశయ సాధనకై పోరాడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కో కన్వీనర్ టైలర్ ముస్తఫా ఓబులేసు రహీం ఖాదర్ వలీ సూర్యనారాయణ రజియా బాబా ఫక్రుద్దీన్ ముజఫర్ హాజీవలి హైదర్ తదితరులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముదిగుబ్బలో ఘనంగా మే డే వేడుకలు: కార్మిక చట్టాల రక్షణకై పోరాడతామని సిఐటియు పిలుపు
