Latest Posts

ముదిగుబ్బ మండలంలో విషాదం: షార్ట్ సర్క్యూట్‌తో పశువుల కొట్టం దగ్ధం.. మూగజీవాలు సజీవదహనం

🔥 బుధవారం సాయంకాలం అగ్ని ప్రమాదం… క్షణాల్లో బూడిదైన కొట్టం 🔥

📍 ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారి పల్లి గ్రామంలో విషాదం

ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని సిరిగారి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం సాయంకాలం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న నరసింహులు జీవనాధారంగా నిర్మించుకున్న పశువుల కొట్టం విద్యుత్ వైర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

ఆ సమయంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవడంతో మంటలను వెంటనే అదుపు చేయలేకపోయారు. మంటలు వేగంగా వ్యాపించి కొట్టంలో ఉన్న రెండు మేకలు, రెండు మేకపిల్లలు, ఐదు కోళ్లు సజీవదహనమయ్యాయి. ఈ ఘటనలో సుమారు ₹50,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు చిన్న నరసింహులు వాపోయారు.

గ్రామస్తులు సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది.

👉 బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదం గ్రామంలో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.

Posted Under AP
Editor