Latest Posts

అంగన్వాడి వర్కర్ సస్పెన్షన్…

అనంతపురం జిల్లా, బొమ్మనహళ్.

 

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం కురువల్లి గ్రామంలోని అంగన్వాడి-2 కేంద్రానికి చెందిన అంగన్వాడి వర్కర్ పార్వతిని బుధవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మనల్ మండల కేంద్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ,కేంద్రంలో పిల్లల బరువులు తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో పాటు, పోషకాహార వివరాలు మరియు పిల్లల ఆరోగ్య రికార్డులు సక్రమంగా నమోదు చేయకపోవడం పై విచారణలో తేలింది. ఐసీడీఎస్ అధికారుల నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పిల్లల పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అలాగే అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల బరువులు, హాజరు, పోషకాహార పంపిణీ వివరాలను నిత్యం సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Posted Under AP
Editor